
నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
నన్నే నీలొ కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవని
ప్రతి పూట పువ్వై పుడత
నిన్నే చేరి మురిసేలా
ప్రతి అనువు కోవెలనౌతా
నువ్వే కొలువు తీరేలా
నూరెళ్ళు నన్ను నీ నివేధనవని
నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించె గంధం నేనవని
ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాపగలిగిన కైలాసమా
కొంగు ముడులలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి దారపొయనా
ఆయువంత వెలిగించి హారతియ్యనా
నిన్నే నిన్నే నిన్నే ఓ
నిన్నే నిన్నే నిన్నే