BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Thursday, October 14, 2010

సాయం

ఒక గ్రామమంలో ఇద్దరు ప్రాణస్నేహితులు వుండేవారు.వారిలో ఒకరికి కళ్ళు లేవు .అంధుడు .స్నేహితుడు రోజు అతన్ని బడికి తీసుకుపోయేవాడు.మార్గమధ్యలో పచ్చని పొలాల గురించి ,అందమైన ఇళ్ళ గురించి ,కొలను అందులో వయ్యారంగా నడిచే హంసల గురించి చెప్తువుండేవాడు .కళ్ళు లేకపోయినా అవి తన మనోఫలకంఫై చూస్తూ ఎంతో ఆనందించేవాడు .ఆ గ్రామంలో ఎక్కడ చూసినా అందమే. దాన్ని ఎంతో అందమైన మాటల్లో తన స్నేహితుడు వర్ణిస్తూంటే దానికి తగ్గట్టుగానే అతను దృశ్యాన్ని ఊహించుకునేవాడు.ఒకనాడు దురదృష్టవశాత్తు రోడ్డులో వస్తున్న లారీ మీదకివస్తుండగా తన అంధ స్నేహితున్ని కాపాడే ప్రయత్నంలో అతన్ని పక్కకు తోసేసాడు .కానీ ఆ లారి తనమీదకు దూసుకురావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు .కానీ తన తల్లితండ్రుల సహాయం తో వెంటనే తన కళ్ళు తన స్నేహితునికి ఇచ్చాడు.చూపు వచ్చిన ఆనoదంకన్నా తన స్నేహితున్ని చూడలేకపోయానే అనే బాధ ఎక్కువగా వుండేది .అంతకన్నా భాదాకరమైన దేమిటంటే ,తన స్నేహితుడు చెప్పినట్లుగా ఆ గ్రామమలో పచ్చని పొలాలు లేవు.ఒక్క పెంకుటిల్లు కూడా లేదు .అన్ని గుడిసెలే.కొలను లేదు ,హంసలు లేవు.ఏమిటి ఇదంతా అని తన తల్లితండ్రులను అడిగితే."మా వాడికి నువ్వంటే ఎంతో ఇష్టం .నీకు ఆనందం ఇవ్వడం కోసమే అలా మాట్లాడాడు.అలా మాట్లాడినందువలన నీకు కలిగిన ఆనందం కంటే మా వాడికి కలిగిన ఆనదంమే ఎక్కువ ."అంటూ చెమర్చిన కళ్ళతో చెప్పారు .
"ఇచ్చుటలో వున్నా హాయి.
వేరేచ్చటను లేనేలేదు" .



అలా మనం ఇతరులకు ఏమైనా ఇవ్వచ్చు దాని వల్ల వారు పొందే ఆనందం కన్నా మనం అనుభవించేది అధికం. అది ఒక వస్తువే కానవసరం లేదు .ఒక మంచి మాట,ఒక స్నేహ హస్తం,ఒక ఓదార్పు,ఇలా ఏదైనా కావచ్చు అది వారికీ ఎంతో స్పూర్తినిస్తుంది .ఎంతో స్పందన కలిగిస్తుంది .ఉతేజ్జంగా ఉంచుతుంది .ప్రేరణ కలిగిస్తుంది .ఇలా మనం ఒకరికి ఎంతోకొంత ఉపయోగపడి వారికి మంచి స్నేహితుల్లా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వచ్చు .............................ఇవ్వటం లో ఒక ఆనందం వుందని ప్రతీ వ్యక్తి ఏదో ఒక రోజు అనుభవం పొంది వుంటారు .త్యాగం చెయ్యమంటే మరి కర్ణుడి లాగ కాదు సుమా.........ఇవ్వడం లో ఆనందం వుండటం నిజమే కానీ హద్దులు చూసుకోవాలి.ఎలా "రెండు చేతులు కలిస్తే చెప్పట్లు అవుతాయో అలాగే సహాయం అందుకునేవాడికి అవసరం వుండాలి" ..... సహాయం చెయ్యాలని ఇంట్లో వారిని బాధపెట్టి ఊరికి సేవ చెయ్యకూడదు ...కర్ణుడు కవచ కుండలాలు ఇచ్చి నష్టపోయినట్లుగా ...ఏకలవ్యుడు ,సిబి చక్రవర్తి లా అంత త్యాగాలు చెయ్యకూడదు ..మనకి చెయ్యాలి అనిపిస్తే చెయ్యడం ..లేదంటే లేదు.....

మనం ఈ ప్రపంచం నుండి తీసుకు పోయేది ఏమి లేదు ...కాబట్టి ఉన్నంతలో మరొకరికి సహాయం చేద్దాం. మన తర్వాత కూడా మనం జనం మదిలో శాశ్వతంగా బ్రతికివుందాం... ఈ నా చిన్న ప్రయత్నంలో మీరు నాకు సహాయంగా నిలుస్తారు కదా.......








No comments:

Post a Comment