BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Friday, September 16, 2011

ప్రియ నిను చుడలేక
ఊహలో నీ రూపు రాక

నీ తలపుతోనే
నే బ్రతుకుతున్నా(2)

ప్రియ నిను చుడలేక
ఊహలో నీ రూపు రాక

వీచేటి గాలులను
నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యున్నే
నేనడిగాను నీ కుశలం

అనుక్షణం నా మనసు
తహతహలాడే
ప్రతిక్షణం నీ కోసం
విలవిలలాడే

అనుదినం కలలలో
నీ కధలే
కనులకు నిదురలే
కరువాయే

ప్రియ నిను చుడలేక
ఊహలో నీ రూపు రాక

కోవెలలో కోరితిని
నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని
కలకాలం నిను చూడమని

లేఖతో ముద్దయైన అందించరాద
నిను గాక లేఖలనే పెదవంటుకోదా
వలపులో నీ దరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే

ప్రియ నిను చుడలేక
ఊహలో నీ రూపు రాక

నీ తలపుతోనే
నే బ్రతుకుతున్నా(2)

ప్రియ నిను చుడలేక
ఊహలో నీ రూపు రాక

No comments:

Post a Comment