BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Friday, September 16, 2011

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

సూర్యుడల్లే సూది గుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా.
ఆఆనందమేనా... ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమే
కోయిలల్లె వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక వెన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింతగుస గుసల్లే మారుతవు
ప్రేమంటే నీ ప్రేమేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనానా








1 comment: