కలలు ........ మీరు కలలు కంటారా???? ... నాకు తెలిసి అందరికి కలలు వస్తాయి ..మీకు తెలుసో తెలిదో కానీ కొంత మందికి కలలు రావు సుమా!!!....... వాళ్ళు అదృష్టవంతులో .దురదృష్టవంతులో ....తెలిదు.కాని .. సరే కలలు కనే వాళ్ళు మానరు ..కొందరు అందులోనే జీవిస్తుంటారు...వాస్తవం లో జరగనివి ..ఊహల్లో విహరిస్తూ వుంటారు ...
కలలు కనడం మానవ రివాజు ...... శారీరికంగా మనషి అలసిపోయిన ... మానసికంగా ....తను తన పని చేస్తూ వుంటాడు ఎందుకు అంటే మనిషి ఆశ జీవి కదండీ ...........
ఇంతకీ నేను కూడా కలలు కంటాను ..సరే మీకు ఎందకు చెప్తున్నాను అంటే...............................
ఒక చిన్న ఉదాహరణ గా ఈ కధ చదవండి .....
ఒక కుగ్రామంలో అందమైన ,చెక్కని ,అమ్మాయి వుండేది . ఆమె పేరు" పద్మ ".పేరుకు తగినట్లు ...సరస్సు లో "పద్మమంలా" ..ఎంతో కళకళ ఆడేది ..మంచి రూపం,చూడ ముచ్చటగా వుండేది... తను బీద కుటుంబం లో పుట్టింది అమ్మ ,నాన్న ఇద్దరు లేరు ..కానీ ఊరిలో అందరు తనను ఎంతో ఆదరించే వాళ్ళు తను ఎంత అందంగా వుంటుంది అంటే.... ఏ అమ్మాయికైనా అసూయ కలుగుతుంది ."నల్లని కళ్ళు, ఎర్రని పెదాలు,లేత బుగ్గలు,వాలు జడ ,సన్నని నడుము "అబ్బా..నేను చెప్పలేను కానీ నాకు కూడా అసూయ కలుగుంటుంది...అనుకోండి ...
ఆ అమ్మాయి కి ఆ అందం శాపంగా మారింది . ఊరిలో ఆమె ఎవరి మాట వినేది కాదు. రోజు తన కన్నాఅందమైన వాళ్ళు లేరు అని తన"అతిలోక సుందరిలా" ఊహించుకొని . కష్టపడి పని చేస్తే తన అందం ఎక్కడ కనుమరుగు అవ్తుందో అని పగలు రాత్రి నిద్రపోతూ కలలు కనేది ...ఆమె అదృష్టం ....తనకు రోజు ఒకే కల వచ్చేది ..తను రాజకుమారి అయినట్లు ..రాజ భాగ్యాలు అనుభావిస్తునట్లు ..ఇలా ఆమె జీవతం కొనసాగుతుండగా ... ఊరిలో జనం తను ఏమి అయిపోతుందో అన్న భయం తో.. ఆ ఊరిలో పూజారితో చెప్పారు ..పూజారి పద్మను తన దెగ్గరకు పంపమని చెప్పారు ..ఒక శుభదినం ... పూజారి " అమ్మ పద్మ నాకు ఈరోజు ఓపిక లేదు దేవుని పూలూ నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి రా ..అని ఒక బుట్టనిండా చేమంతి పూలూ ఇచ్చి... పద్మ అందరికి ఆ పూలూ ఇచ్చి త్వరగా వచ్చింది .. అప్పుడు స్వామి పద్మ ఇప్పుడు నువ్వు పూలూ ఇచ్చిన అందరు మళ్ళి తిరిగి నీకు పూలూ ఇస్తారు తీస్కో అన్నారు......
ఎంతో ఉషారుగా పద్మ పూలు తీస్కో రాను వెళ్ళింది ...కానీ వాళ్ళు పద్మకు కాగితపు పూలూ ఇచ్చారు ..పూజ చేసిన పిదప పూజారి అమ్మ పద్మ మరల ఈ పూలూ ఎవరింటి నుండి తెచ్చావో ఆ ఇంటికి చేర్చు..పద్మ సంతోషం గా ..పూలూ తెస్కుని వెళ్తుండగా ..దారిలో అంట తను ఎన్ని పూలూ పారేసిందో చూసింది అలాగే ..ఇప్పుడు కూడా కొన్ని పూలూ పారేస్కుంటూ..చివరికి తనకు,, కాలి బుట్ట మిగిలింది ...తను మొదలు చేమంతి పూలూ కనుక జాగ్రతగా చేర్చింది స్వామికి. తరవాత కాగితపు పూలూ కనుక తను ఎంత జాగ్రతగా తెస్కుని వెళ్ళిన
..పూలూ పారేస్కున్నది .
పద్మ పూజారి దెగ్గర జరిగినదంతా చెప్పింది ..అప్పుడు అయన పద్మ జీవితం కూడా అంటే అమ్మ ఎంత జాగ్రతగా వున్నా ఎన్నో కష్టాలు వస్తాయి .. అల అని కష్టాలకి బయపడి నిద్రలో లేదా కలలలో జీవించ కూడదు.. తరువాత పూలలా జీవితం చేజారింది అని ఏడవాలి ..... మనిషి వాస్తవంగా జరగని వాటికోసం కల అనే ఒక ఉహలోకం పెట్టాడు అందులోనే వుండడం తప్పు... నీవు మళ్ళి వెళ్ళి ఎగిరిన పూలూ తెగలవా ??? అలాగే అయిపోయిన జీవితం మళ్ళి తీసుకు రాలేవు ..... కలలు కాగితపు పూల లా అశాశ్వతం ... జీవితం శాశ్వతం కాకపోయినా ..దేవుడి మనకి రాసిన తలరాత ప్రకరాం..అయ్యుషు ఉన్నంతవరకు జీవించాలి .నిద్రలోకం లో ఉండకూడదు.నిద్రపోవాలి కల కనాలి..ఆ కల కోసం బ్రతకకూడదు అన్న చిన్న పాఠం ద్వార పద్మ జీవితాన్ని మార్చారు పూజారి ఆ నాటి నుండి తను సంతోషం గా
జీవించింది ...
నాకు తెల్సి మీకు కూడా అర్దమైంది కదండీ..నేను ఏమి చెప్పదలిచానో .....
అలాగని అసలు నిద్ర పోకుండా జాగారాలు చెయ్యకుండా రోజుకి ఎనిమిది గంటలు /లేదా ఆరు గంటలు సుఖంగా పడుకోండి...
సర్వేజన సుఖినో భవంతు ...... సుఖ నిద్ర ప్రాప్తిరస్తు ....
.
No comments:
Post a Comment