BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Tuesday, May 22, 2012


జీవితానికిఏమన్నా అర్థం ఉందంటావా?ఎన్నో పాత్రలు వస్తున్నాయి--పోతున్నై ఏ పాత్ర నిత్యం ఇక్కడ ?ఏ బంధం సత్యం ఇక్కడ ? ఈటువంటి ఆలోచనలు బుర్రను తేనెటీగల వలె చుట్టూ కున్నై .


జీవితం లో ఎక్కడ బయలుదేరనో తిరిగి అక్కడికే వచ్చినట్టుంది.ఏమిటో జీవితం,ఎందుకు,ఎప్పుడు మెదలవ్వుతుందో,ఎక్కడ ,ఎలా ముగుస్తుందో తెలియటం లేదు



"ఆలోచించడం కంటే జీవితాన్ని వచ్చింది వచ్చినట్టు స్వీకరించటం మంచిదేమో. ఆలోచనాపరులు జీవితాన్ని తమ వైపు మలుపుకోవాలని చూస్తారు.కానీ జీవితం అనేది మలుపుకోటానికి వీలైంది కాదు.ఈ సంగతి అనుభవం మీద మాత్రమే మానవుడు తెలుసుకోగలడు".



"మొదట్లో జీవిత ప్రవాహంలోని ఏ బిందువునో చెదరగొట్టి,ఏ అలనో విరగగొట్టి జీవితాన్ని మనవైపుకు త్రిప్పుకుంటున్నాం అనుకుంటాం .కానీ అది ఒట్టి భ్రమ అని నెమ్మది మీదగాని తెలుసుకోలెం.మనం,అంతకోటి జీవాలను తనలో ఇముడ్చుకొని-పోనీ తనలో కలుపుకొని-నడిచిపోతున్న ప్రపంచం ఏ వొక్కడికోసమైనా ప్రక్కకు తిరుగుతుందని అనుకోవటం వట్టి అహం "

No comments:

Post a Comment