BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Wednesday, July 18, 2012

ప్రేమ ...అమలిన భావగరిమ

 ప్రేమ అనేది అమ్రుతతుల్యమైన  భావం.అమితమైన ఇష్టం .

ఒక మనిషి మీద కావచ్చు ,ఒక జీవం మీద కావచ్చు  .ఒక  భావం మీద కావచ్చు . మనిషి అయతే  తల్లో, చెల్లో, భార్యో , అక్కో ,స్నేహితుడో ,ప్రేయసో  ప్రియుడో అయి ఉండవచ్చు ..............................

ఎవరు ఎవరిని ప్రేమించినా అందులో చిన్నతనం లేదు ... చవక బరుతనం లేదు . పవిత్రత ,స్వచ్చత  వుంది వుండాలి  ప్రేమ అనేది ఒకా ఆద్యాత్మిక భావం ,, అనుసరణీయ కోణం ,నిసిన్చారని లక్షణం ,,,,

 రక్త సంబంధం లేకుండా  ఒక స్త్రీ పురుషున్ని  ప్రేమించినా ,పురుషుడు స్త్రీ ని ప్రేమించినా  తప్పు లేదు . అయతే అది  అమలినమై  వుండాలి .ఆంతర్యానికి సంభందించిన దై వుండాలి .

 నేడు తల్లి తో పాటు స్నేహితులని  ప్రేమిస్తున్నారు  ఫలించకపోతే  లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ  ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం  అజరామరం .తల్లి బిడ్డలని ప్రేమిస్తుంది .అందులో ఎ  దోషం లేదు  ద్వేషం లేదు .ప్రతి ప్రేమ  లభించకపోతే  విద్వేషం లేదు .అసలు ఆ తల్లికి ఎలాంటి ఆశ లేదు వుండదు .బిడ్డ ఆనందం  ఆరోగ్యం జీవితకాల  శ్రేయం .ఇది ముఖ్యం.


 రాధా వంశి మోహనున్ని ఆరాధించింది .అందులో గొప్ప కళ్యాణం వుంది .మంగళం వుంది .శుభం వుంది. నేడు తల్లి తో పాటు స్నేహితులని  ప్రేమిస్తున్నారు  ఫలించకపోతే  లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ  ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం  అజరామరం..... 


 ప్రేమంటే  తెలుసా ??


 ప్రేమ ఒక భావ లీల .ఒక ఆనంద హేల.హృదయ రస ప్రపేల.నిజానికి  ప్రేమ  పొందడం కంటే   ప్రేమించటమే  నిజమైన ప్రేమ  లక్షణం .ప్రేమకు సరి ఆయన నిర్వచనం  నిజమే .మనల్ని ఎవరు పడితే వాళ్ళు ప్రేమించడం బాగుంటుందా ?? మన తహుతుకో ,,మనస్తత్వనికో  ,,అభిరుచికో తుగని వాళ్ళ  ప్రేమ మనకు సంతోషం ఇస్తుందా?? చికాకుగా  ఉండదా? సరే  అది వాళ్ళ ఇష్టం  మనకు ఇంకా  మనం అసహ్యం కలిగించే వాళ్ళు ? వాళ్ళ ప్రేమ  మనకెంత బాదకరంగా,భరింపరానిది గా ఉంటుంది. ఆ ఊహే నచ్చడం లేదు కదా ?   


నిజమైన ప్రేమ  అంటే ప్రేమించడమే .ప్రేమిస్తేనే ఆ మాధుర్యం అర్ధం అవుతుంది .అవగాహనలోకి  వస్తుంది అది ఎవరు ఎవరినైనా కావచ్చు . ఆ అనుభూతి తో జీవితం పున్నమి వెన్నెల అవుతుంది శరీరం,మనస్సు ,ఆత్మ  పులకిస్తాయి .ప్రేమిద్దాం ప్రేమని  ఆస్వాదిద్దాం ... ప్రేమని ప్రేమ తో జయిద్దాం ..
 అది ఎంత మంచిదో అంత పిచ్చిది జాగ్రత్త

 ప్రేమ  కూడా కొందరికి  ఫలిస్తుంది కొందరికి ఫలించదు .... ప్రేమ జీవితాన్ని  స్వర్గం నరకం చేసుకోవడం  మన చేతులో వుంది .. ఆచి తూచి అడుగు వేయండి.    

ఇది నేటి తరం యువత కు నేను ఇచే చిన్న సందేశం ..................................................... 

4 comments:

  1. ప్రేమ గురించి మంచి సందేశం ఇచ్చేసారండి, బాగుంది.
    keep writing.

    ReplyDelete
  2. love is everywhere..
    nice post sai garu :)

    ReplyDelete
  3. సాయి గారు.. ప్రేమ గురించి చక్కగా చెప్పారండీ..
    ప్రేమ ఎంత మంచిదో అంత పిచ్చిది.. నిజమే నండీ...

    ReplyDelete
  4. ప్రేమ మీద చాలా గొప్పగా వ్రాసారు.మరింతగా వ్రాయండి.

    ReplyDelete