Monday, August 9, 2010
ప్రాణ స్నేహం
జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది ...అందులో ఎంతో మందిని కలుస్తాం... అందరూ మనకు స్నేహితులు కారు ..కాలేరు ... కదా అలాంటి మనకి ప్రాణ స్నేహితులు ఎలా అవతారు? .... మనకి ప్రాణం పోస్తారా.?.... లేదా మన ప్రాణం తిస్తారా?..... మనం ప్రాణాలు పోస్తమా? .........తీస్తామా?
ఏంటి అలా బిత్తర చూపులు చూస్తారు ..... అర్ధం కాలేదా ఆలోచించడి కాస్తా ...... అరే ...........
సరే ఓకే మనిషి రెండు పాత్రలుపోషిస్తాడు కదా ...అలా స్నేహితుడు కూడా మంచికి, చెడుకు రెండిటికి తోడ్పడతాడు .. నమ్మరా ............ సరే చూడండి అలాంటి మనిషే .... మా" అరవింద్" ......
రాజమండ్రి లో ఒకచిన్న పల్లెటూరులో మా" అరవింద్", వాళ్ళ అమ్మ" రమణమ్మ" ,నాన్న "ఎంకయ్య " చెక్కగా వ్యవసాయం చేస్కుంటూ కాలంగడిపేవారు ......వున్నటుంది ఎవరి దిష్టి పడిందో ఎంకయ్యకి వ్యాపారం లో బాగా నష్టం వచ్చింది .... రమణమ్మ" ఏమయ్యా ... టౌన్ కి పోయి మన బిడ్డకి పెద్ద చదువులు చెప్పిద్దాం "అని వాళ్ళ పెనిమిటి కి నచ్చచెప్పి వున్న పొలం అమ్ముకొని టౌన్ కి వచ్చి ....... అక్కడ ఏదో చిన్న వ్యాపారం ఆరంభించారు అంతలాభం రాకున్న ఏదో జరిగిపోతుంది ..వాళ్ళకి రాజమండ్రి లో ........ పిల్లాడ్ని ఒక మంచి బడిలో చేర్చారు ..ఇలా కాలం గడిచిపోతున్న తరుణం లో ............
ప్రాణ స్నేహం అంటే మరో వ్యక్తీ కావాలి కదండీ....
అప్పుడు వచ్చాడు హైదరాబాద్ నుండి" గోపి" .......గోపి వాళ్ళ నాన్న "రమణ" బ్యాంకు మేనేజర్ ,అమ్మ "శైలజ" మాములు గృహిణి ......ఈ గోపి కూడా అదే బడి లో చేరాడు ......ఇంక ఏముంది మొదలు,, ఇద్దరు ఒకరంటే ఇంకొకరికి పడదు ....బడ్డ శత్రువులు అవ్వాల్సిన వాళ్ళు ....అన్ని రోజులు వైరం వుండదు కదా అందుకే మంచి మిత్రులు అయ్యారు ....... గోపి బాగా చదివి మంచిఇంజనీర్ ఉద్యోగం సంపాదించాడు ....వాళ్ళ నాన్న లా ...అరవింద్ అంత చదువు రాకున్న ..మంచి మనస్సుతో అందరికిసహాయం చేస్తూ ...బాలమిత్రులు కాస్తా ప్రాణ మిత్రులు అయ్యారు .....'అరవింద్' గోపి తల్లితండ్రులకు కూడా సుపరిచితుడు ..వాళ్ళకు ఏదో సహాయం చేసేవాడు ...మొత్తన్నికి ఒక మాటలో వాళ్ళ స్నేహం అన్నదమ్ముల సంభందం లా అంతగా ................... అలా కలిసిపోయారు .....
హీరోలు వాళ్ళ పరిచయాలు అయ్యాయి కదా ..... ఇప్పుడు హీరొయిన్ పరిచయం ......... సినిమాలో లాగా పాట లేదు కానీ సరోజ .ఆమెను చుస్తే పూలకు కూడా అసూయా పుట్టే అంత అపురూపమైన బొమ్మ .....అంత బాగా చిత్రించాడు దేవుడు .బాపు బొమ్మ మా సరోజ ......... తను మధ్యతరగతి తెలుగింటి అమ్మాయి..డిగ్రీ చేసింది ..... తనకి పెళ్లిసంభందాలు వేట మొదలు పెట్టారు ..... అప్పటికి రెండు మూడు సంబంధాలు వాళ్ళు అంత అందమైన బొమ్మకి కట్నం ఇచ్చుకోలేక .... ఒదులుకున్నారు.
ఈ ముద్దుగుమ్మ ఒక రోజు అరవింద్ కంటపడింది ......ఆమెను చూసి అరవింద్ ...ముగ్దుడై ...చూస్తూ వుంది పోయాడు ..... వెంటనే ఆనందంతో ఇంటికి వచ్చి వాళ్ళ స్నేహితుడికి చెప్పాడు .... అంటే ఆ రోజు నుండి అరవింద్ కి అమ్మాయి తనే.........
ఇంతలో గోపి కి సంభందాలు చూసారు ...గోపి అదృష్టమో ....అరవింద్ దురదృష్టమో తెలిదు కానీ ....గోపికి కూడా సరోజ తెగ నచ్చింది .....ఇంకా సరోజ వాళ్ళ ఇంటికి నిశ్చితార్దం చేసుకోడానికి సిద్దం అయ్యారు వీళ్ళు .............................
నేను ముందే చెప్పా కదండీ ...అన్ని రోజులు వైరం వుండదు కాబట్టి స్నేహం వుందని ...ఇప్పుడు అరవింది హీరో నుంచి విలన్ గా మారదు .......విలన్ ఇంక ఏదో ఒకటి చేసి ఆ సంభందం తప్పేలా చేయాలి . అందుకు వాళ్ళ స్నేహితులతో కలిసి పక్ద్భండి గా పధకం వేసి సరోజ ఉన్న వూరిలో రక్త శిబిరం పెట్టి అక్కడ అందరి దెగ్గర రక్తదానం చేయించాలి అనుకున్నాడు .................
ఎంతో గొప్ప మనసు ఉన్న సరోజ రక్తం దానం చేస్తామని వాళ్ళ స్నేహితులతో అక్కడకి వెళ్ళింది.... అందరు రక్త దానం చేస్తే ...తిను మాత్రం కళ్ళు దానం చేసింది .... అది ఎలా అంటారా...............? అదే కదండీ విలన్ ప్రతిభ...................
అందరికి రక్తదం అని చెప్పి తనకు మత్తు ఇచ్చి కళ్ళు పికేసాడు అరవింద్....... ఆ విషయం తెలిసి వాళ్ళ తల్లి తండ్రులు చాల బాధతో .... ఆ రక్తశిబిరం ప్రధాన కార్యదర్శిని ..నిలదేసారు ...ఆయన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిదు ...మెగాస్టార్ రక్త శిబిరం అంటూ నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాక వుంది వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరో ?ఎ ఊరో?? కూడా తెలిదు అని నచ్చచెప్పాడు ........ సరోజ తల్లితండ్రులు గుండె చెక్కలు అయ్యేదాకా ఏడ్చి ఇంకా తన కూతురుని ఎవరు పెళ్లి చేస్కోరు అని ఎంతో దిగులు పడ్డారు ..........ఇంతలో గోపి కి విషయం తెలిసి ఆ పెళ్లి వద్దని ...నెలలో గా మరో అమ్మాయని పెళ్ళాడాడు ........................ ఏమి చేయలేక వాళ్ళ తండ్రి భయం తో ......
అరవింద్ నెల తర్వాత సరోజ వాళ్ళ ఊర్కి వచ్చి ,వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంతో వినయం గా ఈ రక్త దానం కార్యక్రంలో తన పలు కూడా వుంది అని ,మీరు ఒప్పుకుంటే సరోజని నేను పెళ్లి చేస్కుంటాను అని బాగా చుస్కుంటాను అని ఒప్పించి పెళ్లి చేస్కున్నాడు
కలికాలం కదండి కావాల్సింది వదులుకోలేక .... హీరో నుండి విలన్ పాత్రకు దిగ జారాడు ... చెప్పిన మాట ప్రకారం సరోజ ను బాగా చూస్కుంటూ వచ్చాడు.
సంవత్సరం తరువాత గోపికి విషయం తెలిసింది .....అరవింద్ తన ప్రాణానికి ప్రాణం అనుకుంటే .... తన అరవింద్ తన గొంతు కోసాడు ...... ఇంకా ఏమి చేయాలో తెలియక ......జీవితం తో రజీపడి జీవితం కొనసాగించాడు .................................
ఇలా ఎంత ప్రాణ స్నేహమైన ...... మనకు హాని తలపెడ్తుంది...... అందుకే స్నేహం కూడా మంచిస్నేహం ...చెడు స్నేహం అంటారు ...ఇప్పుడు అర్దమైంది కదండీ .....అరవింద్ మేక వన్నె పులి అని ...... స్నేహం తో దెబ్బతీసాడు డు గోపి ని ...... ఈ కథ లో బలైంది పాపం .... సరోజ
మంచివారితో స్నేహం చెయ్యమని నేను అనను ఎందుకంటే స్నేహం చేస్తే గా ...మంచో చెడో తెలిసేది ...... కొంచం జాగ్రతగా ...స్నేహితులను ఎంచుకోండి ...ఇది ఈ కథ ద్వార నేను చెప్పాలనుకుంది ...... ఇది నేను అల్లినది ..ఎవరిని ఉద్దేశించి కాదు ..........
HAPPY FREINDSHIP DAY
Subscribe to:
Post Comments (Atom)
this is so nice i loved it
ReplyDelete